అనుభవించాలేగాని ,
జీవితమంతా
కచేరీ కెక్కని సంగీతమే .....
కావ్యానికెక్కనికవిత్వమే .....
***
మరణానంతరం కూడా
కొనసాగే సంభాషణ మనమధ్య వుండాలని
బ్రతుకంతా మౌనంగా ఉన్నాను.
గత జన్మ జ్ఞాపకాలతో .....
***
పూలని ముగిస్తున్న తోట ....
కలలని ముగిస్తున్న నిద్ర. ....
ప్రాణాన్ని ముగిస్తున్న దేహం .....
కాలానికి తీరని దాహం .....
***
రాత్రంతా పడవ కోసం
నది ఒడ్డునగడిపాను,
తెల్లవారంగానే తెలిసింది ,
నేను ఎదురు చూడాల్సింది అవతలి ఒడ్డున అని....
***
గంట కోసారి ఆగిపోతూనే వుంది ఈ గడియారం
పదమూడోసారీ ఆగింది .
కొత్తగా లెక్కించే వాడోచ్చాడు .
అప్పుడే తొలిసారి ఆగిపోయిందని ప్రకటించాడు ! అందరూనమ్మారు !!
By
Dr.Raallabandi Kavithaprasad
జీవితమంతా
కచేరీ కెక్కని సంగీతమే .....
కావ్యానికెక్కనికవిత్వమే .....
***
మరణానంతరం కూడా
కొనసాగే సంభాషణ మనమధ్య వుండాలని
బ్రతుకంతా మౌనంగా ఉన్నాను.
గత జన్మ జ్ఞాపకాలతో .....
***
పూలని ముగిస్తున్న తోట ....
కలలని ముగిస్తున్న నిద్ర. ....
ప్రాణాన్ని ముగిస్తున్న దేహం .....
కాలానికి తీరని దాహం .....
***
రాత్రంతా పడవ కోసం
నది ఒడ్డునగడిపాను,
తెల్లవారంగానే తెలిసింది ,
నేను ఎదురు చూడాల్సింది అవతలి ఒడ్డున అని....
***
గంట కోసారి ఆగిపోతూనే వుంది ఈ గడియారం
పదమూడోసారీ ఆగింది .
కొత్తగా లెక్కించే వాడోచ్చాడు .
అప్పుడే తొలిసారి ఆగిపోయిందని ప్రకటించాడు ! అందరూనమ్మారు !!
By
Dr.Raallabandi Kavithaprasad
No comments:
Post a Comment