ఏకాంతం .

ఊరు నిద్రిస్తున్నప్పుడు సరస్సు- ఆకాశం మాట్లాడుకుంటాయి. 
ఇంతలో చినుకులు.
సంభాషణ ఆగింది .
మాటలాపిన సరస్సు మనస్సు లో అలజడి. 
మళ్లీ కలుద్దామని వెళ్ళిపోయిన మబ్బులు. 
ఒడ్డు మీది చెట్ల కళ్లల్లో చిక్కుపడ్డ వాన చుక్కలు.
అంతా కలిస్తే .........
ఒక అసంపూర్ణ ఏకాంతం .

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...