మనిషిదే భాష?

మనిషిదే భాష?
....... ...... ....
సముద్రానిది అలలభాష 
పర్వతానిది శిలలభాష 
చెట్టుదంతా పూలభాష 
పిట్టదంతా గాలిభాష 
మబ్బు కున్నది వానభాష 
మనసు కున్నది మౌనభాష 
నింగి ఉరుముల నాన్నభాష 
నేల కరుణల అమ్మభాష 
హలం కదలిక పొలంభాష
కలం కదలిక గళంభాష
ఏటిదంతా నీటిభాష
ఎడదదీ కన్నీటిభాష
పల్లెటూరిది జనంభాష
పట్టణానిది ధనంభాష
నాయకులదీ ఓట్లభాష
ఎన్నికలలో నోట్లభాష
వయసుదంతా వలపుభాష
ప్రేమదంతా కలలభాష
విషాదానిది మూగభాష
నిషాయెక్కితె రాగభాష
మనిషి మరచెను మాతృభాష
అంతమాయెను సొంతభాష
పలుక నేరడు ప్రకృతి భాష
అంతుపట్టదు అసలుభాష
ఇక మనిషిదే భాష!?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...