స్వప్న'వృత్తాంతం'
డా.రాళ్ళబండి కవితాప్రసాద్
........ ........... .......... ........
ఇన్నాళ్ళూ నా స్వప్నాలు వృత్తాకారం లో ఉండేవి .
ఇప్పుడు దీర్ఘ చతురస్రం గా మారి పోతున్నాయి .
అందరి కలలకు పొడవు ,వెడల్పు మాత్రమే వుంటాయి- నిద్ర మంచం లా ....
నా కలలకు లోతు కూడా వుంటుంది !
మీ కలలకు వైశాల్యం మాత్రమే వుంటుంది ,
నా కలలకు ఘనపరిమాణం కూడా వుంటుంది!
ఎప్పుడూ గుండ్రని కలల కేంద్రం లో నిద్రించే నేను ,
ఇప్పుడు నిటారు సరళరేఖలా మారి
మేల్కొంటున్నాను.
స్వప్న వృత్తం మాయమైంది ....!

No comments:
Post a Comment