అసంకల్పం

అసంకల్పం 
రచన : డా. రాళ్ళబండి కవితాప్రసాద్ 
....... ...... ....... .........

నీలో నిశ్శబ్దంగా ఉండే దెవరు ?
మాట్లాడుతూఉండేదెవరు!
ఒకరు లోపలికి వ్యాపిస్తుంటే ,
ఇంకొకరు బైటకు నడిచి వెళుతుంటారు.ఇద్దరి లో ఎవరితో నీ స్నేహం?

ఇంతలోమూడో మనిషి ప్రవేశం .
నువ్వు ఆశ్చర్యపోయేలోపే
నీలో నీకోసం దాచుకున్నస్థలం మాయమౌతుంది!
నువ్వొక మహాజన ద్వీపం లోకి బదిలీ అవుతావు .

నీ లోకి లోకం
రాకపోకలు మొదలుపెడుతుంది
నీలోని మౌనం
రెక్కలు విదిలించుకుని ఏకాంతం లోకి ఎగిరిపోతుంది ....

ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన మాటలు
నీ నోటితో ఎవరో మాట్లాడుతుంటారు .
నీకు మాత్రం ఏమీ వినపడదు .
నీతో మాట్లాడడానికి ఎవరూ వుండరు!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...