సముద్రం దాడి చేస్తే. .....


రచన : డా. రాళ్ళబండి కవితాప్రసాద్ 


కిటికీ లోంచి సముద్రం దూసుకొస్తుంది
మనస్సుతో మూసినా ఆగడం లేదు .
తల నిండా అలలు .
కళ్ళనిండా నీళ్ళు .
బయటకు దారి లేదు.
సముద్రం ఆగడం లేదు.
మరిగే నీళ్ళలో కలసి పోయే కాఫీ గింజలా
సముద్రం లో కరగి పొతే
రంగు మారి పోతుంది కడలి ,
రుచి మారిపోతుంది పయోధి ,
వాసన మారిపోతుంది వార్ది ,
అందుకే
ఎప్పుడైనా సముద్రం దాడి చేస్తే
నువ్వే సముద్రం లా మారిపో !
మార్చెయ్ సముద్రాన్ని....
హతమార్చెయ్ భయాన్ని .....!!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...