మూలం: 'ఎర్లీ' by మార్క్ నెపో ( reduced to joy )
స్వేచ్చానువాదం : డా .రాళ్ళబండి కవితాప్రసాద్
........ ....... ........ .......
ఎందుకో తెలీదు గాని
ఇవ్వాళ దిగులు తో నిద్రలేచాను .
బహుశా పోగొట్టుకున్నదేదో
గుండె మీద అటు ఇటు తారాడుతోంది ,
తొలిపొద్దు మీద కాకి ఎగిరిన నీడ లా ....
ఇప్పుడు ఆకలేస్తుంది !
ఒక్కోసారి విషాదాన్ని తప్పించుకోడానికి
ఏదో ఒకటి తినాలనిపిస్తుంది
కళ్ళతో పుస్తకాలని ,
జ్ఞాపకాలతో గతాన్ని ,
ఏవో అంచనాలతో అనిశ్చితిని , తినాలనిపిస్తుంది!
ఒక్కోసారి దేశాల పటాలని గీసుకుని తినాలని పిస్తుంది!
నిజానికి ఇదంతా వొట్టి కాలక్షేపానికే !
నేను ప్రేమించిన మనుషులెవరూ కనపడడం లేదు.
కొందరు తప్పుకుని పొయ్యారు .
ఇంకొందరు వాళ్ళ దిగుళ్ళ తో
నన్ను తినడం మొదలెట్టారు !
ఐనా ,
మనం ఎవరిని వదిలేసినా ,
మనల్ని ఎవరు వొదిలేసినా,
మన హృదయం మాత్రం మనల్ని వదలదుగా !
అందుకే,
దాని నీడ లోనే దిగులుపడదాం ........!!!
(18th feb 2014 at 4 am)
స్వేచ్చానువాదం : డా .రాళ్ళబండి కవితాప్రసాద్
........ ....... ........ .......
ఎందుకో తెలీదు గాని
ఇవ్వాళ దిగులు తో నిద్రలేచాను .
బహుశా పోగొట్టుకున్నదేదో
గుండె మీద అటు ఇటు తారాడుతోంది ,
తొలిపొద్దు మీద కాకి ఎగిరిన నీడ లా ....
ఇప్పుడు ఆకలేస్తుంది !
ఒక్కోసారి విషాదాన్ని తప్పించుకోడానికి
ఏదో ఒకటి తినాలనిపిస్తుంది
కళ్ళతో పుస్తకాలని ,
జ్ఞాపకాలతో గతాన్ని ,
ఏవో అంచనాలతో అనిశ్చితిని , తినాలనిపిస్తుంది!
ఒక్కోసారి దేశాల పటాలని గీసుకుని తినాలని పిస్తుంది!
నిజానికి ఇదంతా వొట్టి కాలక్షేపానికే !
నేను ప్రేమించిన మనుషులెవరూ కనపడడం లేదు.
కొందరు తప్పుకుని పొయ్యారు .
ఇంకొందరు వాళ్ళ దిగుళ్ళ తో
నన్ను తినడం మొదలెట్టారు !
ఐనా ,
మనం ఎవరిని వదిలేసినా ,
మనల్ని ఎవరు వొదిలేసినా,
మన హృదయం మాత్రం మనల్ని వదలదుగా !
అందుకే,
దాని నీడ లోనే దిగులుపడదాం ........!!!
(18th feb 2014 at 4 am)
No comments:
Post a Comment