శీర్షిక : ఒంటరి జంట
రచన: డా.రాళ్ళబండి కవితాప్రసాద్
...... ....... ........
విరిగిన రెక్కల పక్షులు రెండు
ఒంటరిగా కుర్చుని మాట్లాడుకుంటున్నాయి,
ఎగిరొచ్చిన ఆకాశం గురించి ,
తాక లేక తిరిగొచ్చిన తారల గురించి....
గూళ్ళు చెదిరిన జ్ఞాపకాలు ,
గుడ్లు పగిలిన జ్ఞాపకాలు,
ఏకాంతంగా గడిపిన వర్షం
ఒంటరిగా ఎదుర్కొన్న తుపాన్లు ....
రాలిపోయిన ఈకల గురుంచి
ఎగిరిపోయిన కాలం గురించి,
గొంతు పెగలక కళ్ళతో
మాట్లాడుకుంటున్నాయి ......
శిఖరాగ్ర వృక్షం పై కూర్చుని లోయను చూసినప్పుడు ,
లోయలో వాలి కొండకొనకేసి జాలిగా ఏటవాలుగా ఎగిరినప్పుడు ,
గూటిలోని పసిపిట్ట గొంతులోచిరుగింజని గుటకేయించి నప్పుడు ,
రెక్క రాలిపడేలావేటగాడి బాణం గుచ్చుకున్నప్పుడు ,
ఏం జరిగిందో నిశ్సబ్దంగా మాట్లాడుకుంటున్నాయి ......
ఇప్పుడు ఎగిరే వీలు లేదు
పాడే అవసరం లేదు.....
కానీ ,
ఎగరాల్సిన దూరం ఇంకా ఉంది ....
పాట సగం లో ఆగింది ....

అత్యంతాద్భుతంగా రాసారు.
ReplyDeleteWowwww..chaalaa baagundi:-):-)
ReplyDelete