హృదయ శబ్దం

శీర్షిక : హృదయ శబ్దం 
రచన : డా.రాళ్ళబండి కవితాప్రసాద్ 
........ ........ ....... 
అతడు రాసిన అక్షరాలన్నీచెరిపేసుకున్నతర్వాత ,
కాగితం మీద కవిత్వం ప్రత్యక్ష మైంది! 
పదార్ధం అదృశ్యమైనవెంటనే
ప్రాణం కనపడ్డట్లు !
సభలోకి సంగీతాన్ని వొదిలి గాయకుడు వెళ్ళిపోయిన తర్వాత ,
పాటలు అతని కోసం వెతుక్కుంటున్నాయి !
చినుకులు తమను వొదిలేసిన
మబ్బుతునక వెంట పడుతున్నట్లు !
గుండెలోని ఒంటరి అక్షరం,మనోనిఘంటువును తెరిచిన తర్వాత ,
నెత్తురు అంటని పదం కోసం అన్వేషిస్తుంటుంది !
మొగ్గల దొంగలు లేని తోట కోసం
పూల తీగ బెరుకుగా ఎదురు చూసినట్లు !
ఆమె తన ప్రణయానుభవాలూరించిన కన్నీటిబావిలోకితొంగిచూసింతర్వాత ,
మౌన ఏకాంత వృక్షాల మధ్య నిలబడిపోయింది !
ఇంకి పోయిన మానస సరోవరం లో
నిరాసక్త రాజహంసిక నిలుచున్నట్లు !
ఈవేళ శూన్యమే మహాకావ్యం ,
నిశ్శబ్దమే మహాభాష్యం ..........

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...