ఆ అమావాస్య రాత్రి


ఇద్దరమే చీకట్లో ఎడం ఎడం గా నడుస్తున్నాం.
అప్పుడప్పుడు నీ నవ్వు చంద్రుడి లా వెలుగుతోంది.
ఇద్దరం మెత్తటి చీకటి తివాచీల మీద నడుస్తున్నాం.

మన మధ్య మౌనం లో బోలెడు సంభాషణలు.
ఇద్దరి మధ్య కిక్కిరిసి పోతున్న ఊహల సమూహాలు.

ఒక మహా జ్ఞాపకం మన లోకి ప్రవేశిస్తున్న నిశ్శబ్దం.

వెలుతురు లోకి శరీరాలు వొచ్చేశాయి .చెరో దారి .
ఇప్పుడు నీనవ్వు ఆకాశం లో సూర్యుడు..

మనిద్దరం ఒకే జ్ఞాపకానికి వేలాడే రెండు శరీరాలం.

ఐనా విడదీసే వెలుతురు కన్నా ,
కలిపి ఉంచే చీకటి మిన్న కదూ!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...