ఆత్మంభర


...... ...... .......
డా.రాళ్ళబండి కవితాప్రసాద్ 
........ ....... ...... 
తెల్ల పూలు పూస్తుందనుకున్న మొక్క 
నీలంగా పూసింది ...
తోటమాలీ ! కన్నీరు పెట్టకు .
అంగీకరించు!
అసలు మొగ్గలే తొడగని మొక్కలు 
ఎన్నోఉన్నాయి ....
ఎండిపోతున్న చిగుళ్ళే ఉన్నాయి !
నీరు పెట్టటడమే నీ పని !

ఆకాశం కింది అందాల తోటలో
ప్రతి మొక్కకు ఎదగడానికి సోంత స్వేఛ్చ ఉంటుంది ...
నువ్వు నీపని చేసు కోడానికి ఉన్నట్లు! 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...