....... ....... ..... ....
చెరువొడ్డున చెట్టు మీది గూటి లోంచి
పిచుకపిల్ల జారి నీళ్ళలో పడింది .
రెక్కలల్లాడిస్తూ
అలలతో యుద్ధం చేస్తోంది ,
బయటా లోపలా బావురు కప్పలు ,
కాళ్ళకు చుట్టుకుని అడ్డం పడుతున్న నాచు ,
అందనంత దూరంలో ఒడ్డు,
గూటిలోని తల్లిపిట్ట ఏడుపు కేకలు ,
మునకేసినప్పుడల్లా ముక్కుల్లోకి నీళ్ళు,
అరచినా పెగలని కంఠం,
ఎక్కడనుంచో రాలిపడింది ఎండుకర్రపుల్ల .
అందుకుంది .
తీరా బయటపడేసరికే ....
బాల్యం , కౌమారం ,యౌవనం , అన్నీగడిచాయి !
తిరిగి వెనక్కి చూసుకుంటే చేసిన యుద్ధమే మిగిలింది .....
ఒక్క ఆత్మీయ బంధమూ లేదు !
పాపం పిచుక !!!
(ఇది మీ కథ కాదుకదా ?)
No comments:
Post a Comment