........ ..... .... ....
"యుద్ధ భూమిలో ఉన్న
అతణ్ణిచూడడానికి వెళ్లాను .
పలకరించే లోపే ఆయుధంతో
వెళ్ళిపొయ్యాడు.....
"ఇంటికి వచ్చాను
ఒంటరిగానే !
నా ఊహలు ఇంకా యుద్ధరంగం లోనే వెతుక్కుంటున్నాయి ,
మనస్సు చుట్టూ భయం పహారా కాస్తుంది .
"ఒక విజయవార్త ఊరంతా ఉత్సాహంగా విహరిస్తోంది !
"ఎవరు గెలిస్తేనేం !?
నా వీరుడు ఇంటికి రానప్పుడు .........
No comments:
Post a Comment